“నేను... మానవ చైతన్యస్థాయిని పెంచి, మనుషులను సత్యధర్మశాంతిప్రేమ పథాలలో దివ్యత్వం దిక్కుకు పయనించేటట్లు చేయడానికి వచ్చాను” అంటూ చిన్ననాడే ఇల్లు వదలి తల్లిదండ్రులకు దూరంగా నివసిస్తూ, 1950 చివరిలో పుట్టపర్తిలో ప్రశాంతి నిలయం—అత్యంత శాంతపూరితమైన నివాసం—నెలకొల్పి దేశవిదేశీయులకు దానినొక ఆలంబనా క్షేత్రంగా తీర్చిదిద్ది పుట్టపర్తిని గత ఆరుదశాబ్ధాలుగా జనబాహుళ్యానికి ఓ పవిత్రయాత్రాస్థలంగా మార్చారు శ్రీ సత్యసాయిబాబా.
“ఉన్నది
ఒకటే మతం, అది ప్రేమ
మతం. ఒకే కులం ఉన్నది,
అది మానవతా కులం. ఉన్నది ఒకటే భాష, అది
గుండెభాష. ఒక్కడే దేవుడు, అతను అంతటా ఉన్నాడు”
అంటూ తనను కోరివచ్చేవారికి బోధిస్తూ,
ఆధ్యాత్మిక గురువుగా ప్రతివారినీ ఆదరించారు. వీరి అనుచరులు—
126 దేశాలలో నివసిస్తున్న దాదాపు 100 మిలియన్లు—వీరిని అవతార మూర్తిగా విశ్వసిస్తారు. నమ్మినవారు వీరి మహిమలను వీరి
దైవత్వానికి నిర్ధారణగా స్వీకరిస్తే, హేతువాదులు దానిని ప్రశ్నించడమూ కలదు.
“మానవత్వానికి
నిరహంకారము ప్రధానమైన గుణము. లోకములో ఈనాడు కావలసినది నూతన మతముకాదు, నూతన
సిద్ధాంతము నూతన విద్యలుకాదు, గుణవంతులైన
స్త్రీ పురుషులు” అంటూ తనను చూడవచ్చిన
ప్రతివారికీ బాబా ప్రశాంతినిలయం ద్వారాలు
తెరిచేవుంచారు.
“ప్రతివాడూ
ఒకేభావమునకే కట్టుబడి ఉండవలెనను నియమం భారతీయులకు లేదు. ప్రతివానిని మన వ్యాఖ్యానమునే అంగీకరింపుమని,
మనపద్ధతులనే అనుసరింపమని బలాత్కారపరచుట మహాపాపమని భారతీయ పరమార్థము” అంటూ తన్ను దర్శించుకోవచ్చిన
దేశవిదేశీయులకు బోధించిన బాబాగారి కీర్తిప్రతిష్ఠలు ప్రపంచం నలుమూలలా వ్యాపించాయన్నందుకు నిదర్శనం: 36,000 సాయి సేవాకేంద్రాలు ప్రపంచంలోని
185 దేశాలలో నిస్వార్థ సేవలందిస్తున్నాయి.
వీటి సభ్యులంతా తమతమ స్పిరుచ్యువల్ ఉన్నతికేకాక,
సమాజంలోని బీదసాదలకు సహాయ సహకారాలు అందిస్తూ
“పూజించే పెదాలకంటే, సహాయం చేసే చేతులు పుణ్యమైనవి”
అన్న బాబా బోధనలను సార్థకం
చేస్తున్నారు.
|
The Sri Sathya Sai Central Trust Drinking Water Projects |
|
The water project of Sri Sathya Sai Central Trust in the Anantapur district of Andhra Pradesh was deployed in two distinct phases: Phase 1: In 1995, a project was initiated to supply potable water to people in the Anantapur district of AP throughout the year. The Trust's strategy was to tap river water, where available, from dams, canals and riverbeds, and then deliver the water through an elaborate network of storage reservoirs, booster pumps and pipes. Under this phase, the number of people served is more than 1.25 million. Phase 2: In 2013, the Trust commenced this phase to serve people who were not covered under Phase 1. The number of people served under this Phase is over 250,000. The Trust replicated the above models in 2001 to provide potable water to 320 villages in Medak and Mahabubnagar districts. Here, it serves more than 1 Million people. This
was further replicated in 2007 in the West Godavari and East Godavri
districts. It serves more than 690,000 people. The projects were
conceptualised and implemented by the Trust. The land and the technical
expertise was provided by the state government at no cost, and executed by an
external construction company. The total cost of the projects was US$ 93.5
Million (as per the current exchange rates). |
|
Source: https://sdgs.un.org/partnerships/sri-sathya-sai-central-trust-drinking-water-projects |
మానవతా
విలువలను సమాజంలో ప్రతిష్ఠాపించాలన్న దృష్టితో శ్రీసత్యసాయి భారతదేశంలో 99 సత్యసాయి విద్యావిహారాలను స్థాపించి, లౌకిక విద్యతోపాటు చిన్నతనం నుంచే విద్యార్థులకు ఆధ్యాత్మికజ్ఞానాన్ని కూడా కలిగించే ఏర్పాటు
చేశారు. ఈ విద్యాలయాలన్నీ పిల్లలకు
కేవలం ఉచితంగా విద్యనేర్పటంతోనే సరిపెట్టుకోక, విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వవికాసానికి కూడా కృషిచేస్తున్నాయి. ఇంతటితో ఆగక
బాబా పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి ఇన్
స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్
అన్న పేరుతో ఓ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి, రెసిడెన్షియల్
విధానంలో నడుపుతున్నారు. నైతికత, క్రమశిక్షణలకు వీరి విద్యాలయాలు మారుపేరు.
“మానవత్వము నుండి దైవత్వంలో ప్రవేశించటంకాదు. మానవత్వంలో దైవత్వములును ఆవిర్భవింపజేసేదే ఆధ్యాత్మికము. ప్రపంచము నుండి పరతత్వములో ప్రవేశించడము ఆధ్యాత్మికము కాదు. పరతత్వాన్ని మానవుని యందు ఆవిర్భవింపజేసుకోవడమే ఆధ్యాత్మికత” అని బోధిస్తూ, అనాది నుండి త్రాగునీరు లేని రాయలసీమ వాసులకు సత్యసాయి మంచినీటి పథకాన్ని ఆరంభించి, దాదాపు 700 గ్రామాలకు త్రాగునీటి వసతిని కల్పించారు.
|
Anantapur
Drinking Water Project highlights |
|
|
No of villages covered |
750 |
|
Population covered |
9 00 000 |
|
Design Population |
12 50 000 |
|
Project cost |
US $ 63 million |
|
Main trunk lines |
750 km |
|
Branch lines |
1550 Km |
|
Overhead service reservoirs(40,000-300,000 liter capacity) |
268 |
|
Ground-level service reservoirs |
125 |
|
Ground-level balancing reservoirs |
21 |
|
Booster stations |
40 |
|
Summer storage tanks |
4 |
|
Summer storage tanks |
3 |
|
Infiltration wells |
13 |
|
Bore wells |
250 |
చక్కటి చదువు, త్రాగునీరు ఉచితంగా అందించటంతోపాటు బీదసాదలకు ఉచిత వైద్యసదుపాయం కూడా అందించాలన్న కాంక్షతో బాబా పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ పేరుతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు 22 నవంబర్ 1990లో శంఖుస్థాపన చేసి, వచ్చే సంవత్సరం నవంబర్ 22న హాస్పిటల్ ని ప్రారంభిస్తాం అని డిక్లేర్ చేయటమేకాక, చెప్పిన తారీకునే హాస్పిటల్ భారత ప్రధానమంత్రిచే ఆరంభించి తన కార్యనిర్వహణాశక్తిని, ఆరంభించిన పనిపట్ల దీక్షను నిరూపించి, ప్రభుత్వ ప్రాజెక్ట్ నిర్వాహకులకు కనువిప్పు కలిగించడమేగాక స్ఫూర్తిదాయకంగా నిలిచారు కూడా. ఈ హాస్పిటల్ లో డబ్బులతో కొనలేనటువంటి ఎన్నో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను కేవలం తన వ్యక్తిగత ప్రభావంతో ఎందరో నిష్ణాతులైన దేశవిదేశ డాక్టర్లను హాస్పిటల్ కు రప్పించి, వారి ద్వారా ఉచితంగా అందించటం ప్రపంచంలో ఎక్కడా వినని ప్రత్యేకత. ఇదేరీతిలో బెంగుళూరులో కూడా శ్రీ సత్యసాయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ ను 2001లో ప్రారంభించి పట్టణవాసులకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను అందించటం ఆరంభించారు.
ఇన్ని
వైవిధ్యాలతో కూడిన సేవాకార్యక్రమాలు ఏకోన్ముఖంగా నడిపించిన శ్రీ సత్యసాయిబాబాగారి శతజయంతి
ఉత్సాహంగా జరుపుకోవటం ఎంతో సంతోషదాయకం!

No comments:
Post a Comment